వరుసగా నాలుగు రోజుల పాటు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. కరోనా భయాలతో షేర్ల ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 272 పాయింట్లు వృద్ధి చెంది 28 వేల 561 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 79 పాయింట్లు లాభపడి 8 వేల 342 వద్ద ట్రేడవుతోంది.
లాభ నష్టాల్లో
పవర్‌గ్రిడ్ కార్ప్, ఐటీసీ, రిలయన్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఐటీసీ, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్ రాణిస్తున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టైటాన్, కోటక్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ నేలచూపులు చూస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు
హాంగ్‌సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్ లాభాల్లో కొనసాగుతుండగా నిక్కీ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.