తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ షేర్ల దన్నుతో లాభాల్లో మార్కెట్లు - సెన్సెక్స్

stock-market-live-updates
స్టాక్​ మార్కెట్ల శుభారంభం.. సెన్సెక్స్​ 100+

By

Published : Jul 16, 2020, 9:35 AM IST

Updated : Jul 16, 2020, 10:24 AM IST

10:14 July 16

ఐటీ షేర్ల అండతో దేశీయ స్టాక్​మార్కెట్లు రాణిస్తున్నాయి. అయితే కరోనా భయాలు మార్కెట్ల లాభాలను పరిమితం చేస్తున్నాయని ట్రేడింగ్ నిపుణులు చెబుతున్నారు.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి 36 వేల 295 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 వేల 667 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో  

ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్ టెక్, టీసీఎస్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, రిలయన్స్ రాణిస్తున్నాయి.

ఐటీసీ, ఎన్​టీపీసీ, టైటాన్, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్,  ఏషియన్ పెయింట్స్, ఓఎన్​జీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా...

షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కాగా వాల్​స్ట్రీట్ లాభాలతో ముగిసింది.

చమురు ధర

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.55 శాతం పడిపోయింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 43.55 డాలర్లుగా ఉంది.

09:59 July 16

ఐటీ షేర్ల అండతో దూసుకుపోతున్న మార్కెట్లు

ఐటీ షేర్ల అండతో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్ టెక్నాలజీ రాణిస్తున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 36 వేల 312 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 53 పాయింట్లు వృద్ధిచెంది 10 వేల 671 వద్ద ట్రేడవుతోంది.

09:31 July 16

స్టాక్​ మార్కెట్ల శుభారంభం.. సెన్సెక్స్​ 100+

లాభాల్లో...

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 116 పాయింట్లకుపైగా పుంజుకుని 36,168 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 18 పాయింట్లు బలపడి 10,636 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Jul 16, 2020, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details