స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 37 పాయింట్లు కోల్పోయి 44,618 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ అతి స్వల్పంగా 5 పాయింట్లు పెరిగి 13,114 వద్ద ఫ్లాట్గా స్థిరపడింది.
ఇటీవలి భారీ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల మిడ్ సెషన్లో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆర్థిక షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అయితే చివరి గంటలో ఐటీ షేర్లు అనూహ్యంగా లాభాల్లోకి రావడం వల్ల సూచీలు మిశ్రమంగా సెషన్ ముగించాయి. లోహ, వాహన రంగ షేర్ల సానుకూలతలూ ఇందుకు తోడయ్యాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 44,729 పాయింట్ల అత్యధిక స్థాయి, 44,169 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,128 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 12,983 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.