హ్యూమనాయిడ్ రోబో సోఫియా మరోసారి వార్తల్లో నిలిచింది. సోఫియా గీసిన ఓ చిత్రం ఎన్‌ఎఫ్‌టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్) వేలంలో రూ.5 కోట్లకు (దాదాపు 7 లక్షల డాలర్లు) అమ్ముడైంది. కృత్రిమ మేథతో గీసిన ఓ చిత్రం వేలంలో అమ్మడం ఇదే ప్రథమం.
ఎలాన్ మస్క్ చిత్రం గీసిన సోఫియా..
ఇటలీకి చెందిన డిజిటల్ ఆర్టిస్ట్ ఆండ్రియా బొనాస్సిటో వద్ద మెళకువలు నేర్చుకుని ప్రపంచ ప్రముఖుల చిత్రాలను గీస్తోంది సోఫియా. వాటిని ఎన్‌ఎఫ్‌టీ రూపంలో వేలం వేస్తున్నారు. ఈ చిత్రాలను డిజిటల్ సంతకంలా బ్లాక్ చెయిన్ లెడ్జెర్స్‌లో భద్రపరుస్తారు. వేలంలో సోఫియా చిత్రాన్ని కొన్నవారికి అధికారిక హక్కులు వర్తిస్తాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చిత్రం, స్వీయ చిత్రాన్ని కూడా సోఫియా గీసింది.