ప్రస్తుతానికి ఖరీదైన, పెద్ద కార్లలోనే ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉంది. ఇకపై మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే చిన్న కార్లలోనూ ఎయిర్‌బ్యాగ్స్ ఉండే విధంగా వాహనాలను తయారు చేయాలని చేయాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ నితిన్ గడ్కరీ(Nitin Gadkari News) ఆటోమొబైల్ సంస్థలకు సూచించారు. బడ్జెట్ కార్లలో తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల రక్షణతో పాటు ప్రమాదాలలో సంభవించే మరణాలను నివారించవచ్చని గడ్కరీ నొక్కి చెప్పారు. వాహనాలపై అధిక పన్నులు, కఠినమైన భద్రత, ఉద్గార నిబంధనలతో ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న తురణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ధనవంతలు కొంటున్న పెద్ద కార్లలో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్(car airbag manufacturers in india) ఏర్పాటు చేసి, చిన్న కార్లలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదని గడ్కరీ ప్రశ్నించారు.
"దిగువ, మధ్యతరగతి ప్రజలు తక్కువ బడ్జెట్ కార్లను అధికంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఆ కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ ఉండవు. ఒకవేళ ప్రమాదానికి గురైతే.. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అన్నిరకాల వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండేలా చూడాలి," అని గడ్కరీ సూచించారు. అలాగే చిన్న కార్లలో అదనపు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేస్తే కనీసం ధర రూ.3,000-4,000 వరకు పెరుగుతుందన్న గడ్కరీ.. "మన దేశంలో పేదలకు రక్షణ కల్పించాలి(రోడ్డు ప్రమాదాలు జరిగితే)" అని అన్నారు.
'ఎన్హెచ్ఏఐ.. బంగారు గని'