తెలంగాణ

telangana

ETV Bharat / business

పేరుకే చిన్న బ్యాంకులు.. పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు మాత్రం భళా! - పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ

High interest rate: ద్రవ్యోల్బణం కారణంగా చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో ఖాతాదారులు తమ డబ్బును నిల్వ చేసేందుకు సుముఖంగా లేరు. అయితే కొత్తగా వచ్చిన కొన్ని చిన్న బ్యాంకులు పొదుపు ఖాతాదారులకు అధిక వడ్డీ ఇచ్చి ఆకర్షిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

small banks offering higher interest rate
ఈ బ్యాంకుల్లో పొదుప ఖాతాపై అధిక వడ్డీ

By

Published : Mar 18, 2022, 2:26 PM IST

High interest savings account: ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండటంతో గత కొంత కాలంగా బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. పొదుపు ఖాతాలో వడ్డీ 3%-3.5% మధ్య ఉంటోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా 5.5శాతం రాబడి మించడం లేదు. దీంతో ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలో డబ్బును నిల్వ చేసేందుందుకు ఇష్టపడటం లేదు. కరోనా తర్వాత చాలామంది యువత స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు అధిక ఆదరణ పొందుతున్నాయి. స్వల్పకాలంలో అధిక రాబడులు కనిపిస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఎన్ని పెట్టుబడులు ఉన్నా.. పొదుపు ఖాతా అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

High interest rate bank

  • ఇప్పుడు కొన్ని బ్యాంకులు పొదుపు ఖాతాపైన మెరుగైన వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇందులో కొత్తతరం చిన్న బ్యాంకులు ముందు వరుసలో ఉంటున్నాయి.
  • ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: నెలవారీ నగదు నిల్వ రూ.2,000 నుంచి రూ.5,000 వరకూ ఉన్న పొదుపు ఖాతాలపై ఈ బ్యాంకు 7 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది.
  • ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: రూ.5లక్షల నుంచి రూ.50లక్షల వరకు నిల్వ ఉంటే ఈ బ్యాంకు 7 శాతం వడ్డీని ఇస్తోంది.
  • ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: పొదుపు ఖాతాపై ఈ బ్యాంకు 7 శాతం వడ్డీని జమ చేస్తోంది. రూ.10 కోట్లకు మించి నిల్వ ఉన్నప్పుడు వడ్డీ రేటు 6.5శాతం.
  • సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: ఈ బ్యాంకు తన పొదుపు ఖాతాదార్లకు 6.25శాతం వడ్డీని అందిస్తోంది. నెలవారీ సగటు నిల్వ రూ.2,000 తగ్గకూడదు.

High interest rate bank in india

వీటితోపాటు కొన్ని నియోబ్యాంకులూ, పేమెంట్స్‌ బ్యాంకులూ పొదుపు ఖాతాపై కాస్త అధిక వడ్డీని అందిస్తున్నాయి. వీటిని ఎంచుకునేటప్పుడు వడ్డీ ఒక్కటే కాకుండా.. నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు, ఏటీఎంలు, శాఖలు తదితరాలనూ పరిగణనలోనికి తీసుకోవాలి.

ఇదీ చదవండి:క్రెడిట్​ కార్డు.. విదేశీ ప్రయాణాల్లో మనకు తోడుగా

ABOUT THE AUTHOR

...view details