తెలంగాణ

telangana

ETV Bharat / business

స్కోడా 'ఎస్​యూవీ కోడియాక్​' న్యూ వెర్షన్​- ధర ఎంతంటే? - స్కోడా న్యూ వెర్షన్​

Skoda suv kodiaq: స్కోడా ఎస్​యూవీ కోడియాక్​ కొత్త వెర్షన్​ రిలీజైంది. మూడు వేరియంట్లలో దీన్ని మార్కెట్​లోకి విడుదల చేసింది సంస్థ. ప్రారంభ ధర రూ.34.99లక్షలుగా ఉంది.

premium-suv-kodiaq
స్కోడా 'ఎస్​యూవీ కోడియాక్​' న్యూ వెర్షన్

By

Published : Jan 10, 2022, 2:36 PM IST

Skoda suv kodiaq: ఎస్​యూవీ కోడియాక్​ కొత్త వెర్షన్​ను మార్కెట్లోకి విడుదల చేసింది దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా. మొత్తం మూడు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్​ షోరూం ప్రారంభ ధరను రూ.34.99లక్షలుగా నిర్ణయించింది.

7 సీటింగ్​ సామర్థ్యంతో ఉన్న ఈ ఎస్​యూవీ శ్రేణిలోని కొత్త వెర్షన్​లో మరిన్ని లగ్జరీ ఫీచర్లను జత చేసినట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్​ జాక్​ హాలిస్ ప్రకటనలో తెలిపారు. ఇది 7.8 సెకన్లలోనే 100కి.మీ వేగాన్ని అందుకోగలదని చెప్పారు.

స్కోడా 'ఎస్​యూవీ కోడియాక్​' న్యూ వెర్షన్

స్పోర్ట్​లైన్​, లారిన్​, క్లెమెంట్​ అనే మూడు వేరియంట్లలో స్కోడా ఎస్​యూవీ కోడియాక్ లభిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.34.99 లక్షలు, రూ. 35.99 లక్షలు, రూ.37.49 లక్షలుగా ఉన్నాయి.

భద్రత విషయంలో ఈ మోడల్​ మరింత పకడ్బంధీగా ఉంది. 9 ఎయిర్ బ్యాగులు, అడాప్టివ్​ ఫ్రంట్​ హెడ్​లైట్స్​, డీఫాగింగ్​, ఎలక్ట్రానిక్​, మెకానిక్​, హైబ్రిడ్​ బ్రేక్​, స్టెబిలిటీ కంట్రోల్​ వంటి అత్యాధునిక ఫీచర్లున్నాయి. దీంతోపాటు 360డిగ్రీల స్టాండర్డ్​ కెమెరా కూడా ఉంది.

ఇదీ చదవండి:Cafe coffee day: రూ.వేల కోట్ల అప్పులకు వారసురాలైంది

ABOUT THE AUTHOR

...view details