తెలంగాణ

telangana

ETV Bharat / business

''జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్​, డీజీల్​'పై చర్చకు సిద్ధం' - ఇంధన ధరలపై పార్లమెంటు సభ్యులు

పెట్రోల్, డీజిల్​ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. అధిక ఇంధన ధరలపై పార్లమెంటు సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై ఆమె ఈ విధంగా స్పందించారు.

Sitharaman said she would love to discuss the issue of bringing petrol and diesel under GST in the next GST Council meeting.
'పెట్రోల్​, డీజీల్​పై జీఎస్​టీ.. చర్చకు సిద్ధం'

By

Published : Mar 23, 2021, 8:42 PM IST

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తగా ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌పై కేవలం కేంద్రం మాత్రమే పన్నులు విధించడం లేదని, రాష్ట్రాలు కూడా విధిస్తున్నాయని తెలిపారు. కేంద్రం వసూలు చేసే పన్నులను రాష్ట్రాలకు కూడా పంచుతోందని గుర్తు చేశారు.

''పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే అంశాన్ని చాలా మంది సభ్యులు లేవనెత్తారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పుడే అత్యధిక పన్నులు ఉన్నాయని ఒక సభ్యుడు అన్నారు. పెట్రోల్‌పై రాష్ట్రాలు సైతం పన్నులు విధిస్తాయి. కేవలం కేంద్రం మాత్రమే పన్నులు వేయదు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం వంద రూపాయలు వసూలు చేస్తే అందులో 41శాతాన్ని రాష్ట్రాలకు వెళుతుంది.''

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

ఇంధనంపై వసూలు చేసే పన్నులను కేంద్రం.. రాష్ట్రాలతో పంచుకుంటుందని మంత్రి తెలిపారు. ఇంధన ధరల పెరుగుదలపై సభ్యుల ఆందోళన సరైనదేనని తెలిపిన ఆమె.. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదని ప్రశ్నించారు. తదుపరి జీఎస్టీ మండలి సమావేశంలో తప్పకుండా దీనిపై ప్రస్తావన వచ్చేలా నిజాయితిగా ఆలోచిస్తానని తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు ఆ అంశం ఎజెండాగా ఉంటే సంతోషిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి:బీమా సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details