Cyrus Poonawalla: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తున్న టీకాలు ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా ప్రజల ప్రాణాలను కాపాడినట్లు సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలా తెలిపారు. సోమవారం పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సైరస్ పాల్గొని ప్రసంగించారు. 'తక్కువ ధరకే వ్యాక్సిన్లు.. అధిక పనితీరు.. ఇదే మా విజయ రహస్యం' అని ఈ సందర్భంగా తెలిపారు. 170కి పైగా దేశాల్లో పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఎస్‌ఐఐ వ్యాక్సిన్లు ఉపయోగపడ్డాయని చెప్పారు. సంస్థ తయారు చేసిన టీకాల కారణంగానే వారి ప్రాణాలు నిలిచినట్లు తాను చెప్పగలనన్నారు.
'మా టీకాల వల్ల మూడు కోట్లకుపైగా ప్రాణాలు సేఫ్' - కొవిడ్ వ్యాక్సిన్స్
Cyrus Poonawalla: సీరమ్ సంస్థ ఉత్పత్తి చేసిన టీకాలతో ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల మందికిపైగా ప్రజల ప్రాణాలు కాపాడామని అన్నారు ఆ సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలా. 170కి పైగా దేశాల్లో పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఎస్‌ఐఐ వ్యాక్సిన్లు ఉపయోగపడ్డాయని చెప్పారు.
సంస్థ తొలి రోజులను గుర్తుచేసుకుంటూ.. పుణెలోని ఓ మారుమూల ప్రాంతంలో కంపెనీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడి శాస్త్రవేత్తలు క్రమంగా ప్రపంచంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. తమ సంస్థ.. అభివృద్ధి చెందుతోన్న దేశాలను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్లు రూపొందిస్తోందని వెల్లడించారు. ఇంత తక్కువ ఖర్చుతో కరోనా టీకా 'కొవిషీల్డ్' ఉత్పత్తి ఎలా సాధ్యమని చాలామంది ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. భారత్‌లో ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా పేరుగాంచిన సీరం ఇన్‌స్టిట్యూట్.. ఆస్ట్రాజెనెకా టీకాను స్థానికంగా కొవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇదీ చూడండి :12-18 ఏళ్ల పిల్లలకు కార్బెవాక్స్ అత్యవసర వినియోగానికి సిఫార్సు!