చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా నిలిచేందుకు గూగుల్ ఇండియాతో(sidbi google) భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్లు భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) తెలిపింది(sidbi latest news). ఇందులో భాగంగా.. ఎంఎస్ఎంఈలకు(sidbi msme loan) రూ.కోటి వరకు పోటీతత్వ వడ్డీ రేట్లతో ఆర్థిక సాయం అందించేందుకు సామాజిక ప్రభావ రుణ(sidbi msme loan) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
కొవిడ్-19 సంబంధిత సంక్షోభ స్పందన కింద సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 15 మిలియన్ అమెరికా డాలర్ల(రూ.110 కోట్లు) కార్పస్ నిధి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది సిడ్బీ(sidbi news). రుణ కల్పన కార్యక్రమం ముఖ్యంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ (రూ.5 కోట్లలోపు టర్నోవర్) సంస్థలను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్నామని, రూ.25 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు అందించనున్నట్లు వెల్లడించింది.