భారతీ ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. 2017 జులై-సెప్టెంబరు జీఎస్‌టీ రిటర్న్‌ల సవరణ ద్వారా భారతీ ఎయిర్‌టెల్ రూ.923 కోట్ల పన్ను రీఫండ్ చేయడంపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు ఆమోదించింది.
2020 మే నెలలో అదనపు జీఎస్టీని భారతీ ఎయిర్‌టెల్‌కు రెండు నెలల్లోనే చెల్లించాలని దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఈ ఏడాది జులైలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేంద్రం. తాజాగా దీనిపై స్పందించిన ధర్మాసనం విచారణకు ఆమోదం తెలిపింది. ఫలితంగా భారతీ ఎయిర్‌టెల్ షేరు ధర రూ.8 మేర నష్టపోయి రూ.695 వద్ద ట్రేడవుతోంది.