తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా టీకాపై రెండు, మూడో దశ పరీక్షలు షురూ - కోవ్యాక్సిన్

భారత్​లో కరోనా వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్​ ప్రారంభించినట్లు సీరం సంస్థ తెలిపింది. 1,600 మంది యువతీ యువకులపై ఈ ప్రయోగాలు చేపట్టినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 17 కేంద్రాల్లో ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Serum Institute initiates phase 2, 3 clinical study on 1,600 volunteers for potential COVID-19 vaccine
రెండు, మూడో దశ టీకా ప్రయోగాలు ప్రారంభం

By

Published : Aug 19, 2020, 7:58 PM IST

భారత ఫార్మా దిగ్గజం సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్​పై రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. వ్యాక్సిన్ సమర్థతను తెలుసుకునేందుకు ఆరోగ్యకరంగా ఉన్న యువతీయువకులపై ఈ ప్రయోగాలు మొదలుపెట్టింది.

ఈ ట్రయల్స్​ కోసం 1600 మంది వలంటీర్లు ముందుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా 17 కేంద్రాల్లో టీకా ప్రయోగాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలోనూ ఈ ట్రయల్స్​ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అర్హులైన 1600 మంది అభ్యర్థుల్లో 400 మందిని రోగనిరోధక పరీక్షల(ఇమ్యునోజెనిసిటీ కొహోర్ట్)కు ఎంపిక చేసినట్లు సీరం సంస్థ వెల్లడించింది. వీరిని 3:1 నిష్పత్తిలో విభజించి కొవిషీల్డ్ లేదా ఆక్స్​ఫర్డ్ టీకాను ఇవ్వనున్నట్లు తెలిపింది.

మిగిలిన 1,200 మంది వలంటీర్లపై టీకా సురక్షితమో కాదో తెలుసుకునే(సేఫ్టీ కొహోర్ట్) పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది సీరం. వీరిని 3:1 నిష్పత్తిలో విభజించి కొవిషీల్డ్​ లేదా ప్లాసిబోను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

డోసులు ఇలా!

భారత క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ వివరాల ప్రకారం కొవిషీల్డ్​ను ఒకటో రోజు, 29వ రోజు.. రెండు డోసుల చొప్పున శరీరానికి నేరుగా ఇంజెక్షన్ రూపంలో అందించాలి. 0.5 మి.లీ మోతాదులో ఈ టీకాను ఇవ్వాలి.

ఆక్స్​ఫర్డ్ టీకాను రెండో డోసుగా.. తొలి రోజు, 29వ రోజు 0.5 మి.లీ మోతాదు చొప్పున అందించాలి. ప్లాసిబోను ఒకటి, 29వ రోజు 0.5మి.లీ చొప్పున రెండు డోసులు ఇవ్వాలి.

ఇదీ చదవండి-రెండో రాజధానిగా మధురై- వికేంద్రీకరణా? ఓట్ల వ్యూహమా?

ABOUT THE AUTHOR

...view details