తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీలో అమ్మకాలు- మార్కెట్లకు నష్టాలు

stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Jun 25, 2020, 9:35 AM IST

Updated : Jun 25, 2020, 3:47 PM IST

15:45 June 25

రెండో రోజూ నష్టాలు..

కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయి 34,842 వద్దకు చేరింది. నిఫ్టీ 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,289 వద్ద స్థిరపడింది.

  • ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
  • ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, కోటక్ బ్యాంక్, హెచ్​యూఎల్​, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి.
  • ఏషియన్ పెయింట్స్, ఇన్ఫీ, హెచ్​సీఎల్​టెక్, ఎం&ఎం, ఓఎన్​జీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:26 June 25

ఐటీ, బ్యాంకింగ్ ఊగిసలాట..

స్టాక్ మర్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్​ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడం వల్ల సెన్సెక్స్ 170 పాయింట్లు కోల్పోయి 34,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా నష్టంతో 10,260 వద్ద ట్రేడవుతోంది.

  • ఐటీ, బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.
  • ఐటీసీ, బజాజ్ ఆటో, నెస్లే, మారుతీ, పవర్​గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఏషియన్ పెయింట్స్, ఇన్ఫీ, ఎం&ఎం, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

10:59 June 25

తేరుకున్న సూచీలు..

స్టాక్ మర్కెట్లు నష్టాల నుంచి తేరుకున్నాయి. ఆర్థిక రంగంలో ఒక్కసారిగా పెరిగిన సానుకూలతలతో సూచీలు లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 100 పాయింట్లకుపైగా లాభంతో 34,971 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 10,333 వద్ద కొనసాగుతోంది.

  • ఐటీసీ, పవర్​గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్​సర్వ్, హెచ్​సీఎల్​టెక్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:03 June 25

10,300 దిగువకు నిఫ్టీ

స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఆరంభంలోనే భారీ నష్టాలను నమోదు చేశాయి సూచీలు. సెన్సెక్స్ ప్రస్తుతం 100 పాయింట్లకుపైగా నష్టంతో 34,766 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా కోల్పోయి 10,282 వద్ద ట్రేడవుతోంది.

  • ఐటీ, బ్యాంకింగ్, ఇంధన షేర్లలో అమ్మకాల ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంది.
  • ఐటీసీ, బజాజ్ ఆటో, ఎన్​టీపీసీ, మారుతీ, పవర్​గ్రిడ్ లాభాల్లో ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:26 June 25

నష్టాల్లో మార్కెట్లు

కరోనా కేసుల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్చ్సేంజి సూచీ సెన్సెక్స్​ 339 పాయింట్లు నష్టంతో 34,525 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 99 పాయింట్ల క్షీణతతో 10,206 వద్ద కొనసాగుతోంది. 

Last Updated : Jun 25, 2020, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details