తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల స్వీకరణతో నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల సూచనలు, విదేశీ నిధుల ప్రవాహం కారణంగా ఇవాళ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమూ ఇందుకు తోడైంది. ఫలితంగా బ్యాంకింగ్, ఐటీ, వాహన రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

లాభాల స్వీకరణతో నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Sep 25, 2019, 10:14 AM IST

Updated : Oct 1, 2019, 10:46 PM IST

స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా బ్యాంకింగ్​, ఐటీ, వాహన రంగాలు నష్టాలు చవిచూస్తున్నాయి. శుక్రవారం, సోమవారం నమోదైన భారీ లాభాలను సొమ్ము చేసుకునేందుకు మదుపరులు మొగ్గు చూపడమూ మరో కారణంగా కనిపిస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 279 పాయింట్లు కోల్పోయి 38 వేల 817 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 11 వేల 506 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

పవర్​గ్రిడ్​ కార్ప్, జీ ఎంటర్​టైన్​మెంట్​, టైటాన్​ కంపెనీ, రిలయన్స్​, ఎన్​టీపీసీ, టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్ రాణిస్తున్నాయి.

నష్టాల్లో

టాటా మోటార్స్, ఎస్​బీఐ, హిందాల్కో, వేదాంత, హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ, షాంఘై కాంపోజిట్​ సైతం నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ

ప్రారంభ ట్రేడింగ్​లో రూపాయి విలువ తగ్గి 7 పైసలు తగ్గి.. ఒక డాలరుకు రూ.71.08 గా కొనసాగుతోంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.71 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్​ ధర 62.65 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: రైతుల కోసం ప్రత్యేక యాప్​ ఆవిష్కరించిన కేంద్రం

Last Updated : Oct 1, 2019, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details