తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లపై బేర్​ పంజా.. 49 వేల దిగువకు సెన్సెక్స్ - స్టాక్ మార్కెట్ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ భారీగా 746 పాయింట్లు తగ్గి.. 49 వేల మార్క్​ కోల్పోయింది. నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 14,400 దిగువన స్థిరపడింది.

stocks lose heavily today
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

By

Published : Jan 22, 2021, 3:44 PM IST

Updated : Jan 22, 2021, 4:41 PM IST

వారాంతంలో స్టాక్​ మార్కెట్లపై బేర్​ పంజా విసిరింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ భారీగా 746 పాయింట్లు తగ్గి 48,878 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 14,371 వద్ద స్థిరపడింది. మార్కెట్లు నష్టాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్​.

ఇటీవల వరుసగా రికార్డు స్థాయి లాభాలను గడిస్తూ వస్తున్నాయి సూచీలు. సెన్సెక్స్ గురువారం 50 వేల మార్క్​ను కూడా దాటింది. అయితే ఈ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లూ భారీగా పతనమవడం కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

దాదాపు అన్ని రంగాల ఒడుదొడుకులు ఎదుర్కొనగా.. బ్యాంకింగ్ షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 49,676 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,832 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,619 పాయింట్ల గరిష్ఠ స్థాయి 14,357 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

30 షేర్ల ఇండెక్స్​లో బజాజ్ ఆటో, హెచ్​యూఎల్​, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

యాక్సిస్​ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, బజాజ్ ఫినాన్స్ షేర్లు భారీగా నష్టాలను నమోదు చేశాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన.. షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్​​ సూచీలూ శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:పద్దులో మధ్యతరగతి వర్గం కోరుతున్నదేమిటి?

Last Updated : Jan 22, 2021, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details