తెలంగాణ

telangana

ETV Bharat / business

సానుకూల 'వాణిజ్య' పవనాలతో మార్కెట్లు వృద్ధి!

అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ముగింపు అంచనాలు, దేశీయ మార్కెట్లో విదేశీ మదుపరుల పెట్టుబడి వల్ల స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 29 పాయింట్లు పెరిగి 38,535 వద్ద ట్రేడవుతోంది. 9 పాయింట్ల వృద్ధితో 11, 437 గా కొనసాగుతోంది నిఫ్టీ.

సానుకూల 'వాణిజ్య' పవనాలతో మార్కెట్లు కళకళ!

By

Published : Oct 16, 2019, 10:20 AM IST

Updated : Oct 16, 2019, 3:30 PM IST

అమెరికా- చైనా వాణిజ్య యుద్ధ ముగింపు అంచనాలు, దేశీయ మార్కెట్లో విదేశీ మార్కెట్ల ప్రవాహం కొనసాగుతుండటం వల్ల స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 29 పాయింట్లు పెరిగి 38వేల 535 వద్ద కొనసాగుతోంది. 9 పాయింట్ల వృద్ధితో 11, 437 వద్ద జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ ట్రేడవుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు...

బజాజ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఓఎన్​జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు..

వేదాంత, పవర్ గ్రిడ్, ఐటీసీ, హీరో మోటర్​ కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎల్​ అండ్ టీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి క్షీణత..

డాలరు మారకం విలువతో పోలిస్తో రూపాయి విలువ 12 పైసలు తగ్గి 71.66 గా కొనసాగుతోంది.

Last Updated : Oct 16, 2019, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details