తెలంగాణ

telangana

ETV Bharat / business

లోహ, ఐటీ రంగాల ఊతంతో సూచీల పరుగులు

దేశీయ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 200 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 12 వేల 100 మార్కు ఎగువకు చేరింది. లోహం, ఐటీ రంగాల షేర్లు పరుగులు పెడుతున్నాయి.

sensex-rises-137-dot-76-pts-to-41076-dot-48-in-opening-session-nifty-advances-42-dot-55-pts-to-12096-dot-50
లోహ, ఐటీ రంగాల ఊతంతో సూచీల పరుగులు

By

Published : Dec 17, 2019, 9:58 AM IST

స్టాక్​మార్కెట్లు మళ్లీ లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూలతల నడుమ.. దేశీయ సూచీలూ సానుకూలంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్తు రంగం మినహా.. లోహం, ఐటీ, ఇన్​ఫ్రా, బ్యాంకింగ్​ రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 245 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 41 వేల 184 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 63 పాయింట్లు వృద్ధి చెంది.. 12 వేల 116 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివివే...

వేదాంత, ఎస్​ బ్యాంక్​, జీ ఎంటర్​టైన్​మెంట్స్​, ఇన్ఫోసిస్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హిందాల్కో, సిప్లా, మారుతీ సుజుకీ, టెక్​ మహీంద్రా ఉత్తమ లాభాల్లో కొనసాగుతున్నాయి.

గెయిల్​, యూపీఎల్​, ఓఎన్​జీసీ, ఎన్టీపీసీ, ఐఓసీ, హెచ్​డీసీ, నెస్లే, సన్​ ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్​ ఆరంభ ట్రేడింగ్​లోనే డీలాపడ్డాయి.

రూపాయి..

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా 4 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 70.96 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details