స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 113 పాయింట్లు బలపడి.. 40,544 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 24 పాయింట్ల వృద్ధితో 11,897 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, దేశీయంగా మదుపరుల అప్రమత్తతల నడుమ సూచీలు ఆరంభంలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయితే ఐటీ షేర్లు రాణించడం వల్ల మార్కెట్లు సానుకూలంగా ముగియటం గమనార్హం.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,732 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,305 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,924 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,837 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాలను నమోదు చేశాయి.