బ్యాంకింగ్, వాహన రంగాలు రాణించడం, ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందనే అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 277 పాయింట్లు లాభపడి 36 వేల 976 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 85.65 పాయింట్లు వృద్ధి చెంది 10 వేల 948 వద్ద స్థిరపడింది.
లాభాల్లో...
ఎస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్ర, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ (5.30 శాతం వరకు) రాణించాయి.
నష్టాల్లో...
జీ ఎంటర్టైన్మెంట్, సిప్లా, పవర్‌గ్రిడ్ కార్ప్, టీసీఎస్, ఆర్ఐఎల్, వేదాంత, ఇన్ఫోసిస్, ఐటీసీ, రిలయన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో (1.52 శాతం) నష్టపోయాయి.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి సమీక్ష జరుగుతోంది. మందగించిన ఆర్థిక వ్యవస్థను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు (రెపో రేటు, రివర్స్ రెపోరేటు, సీఆర్ఆర్) తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమల అధినేతలతో సమావేశమవుతానని ప్రకటించడం కూడా మార్కెట్ సెంటిమెంటుకు బలం చేకూర్చింది.