దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలు సహా దేశ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠానికి, తయారీ రంగ వృద్ధి 15నెలల కనిష్ఠానికి పడిపోవడం, బొగ్గు, ముడి చమురు, సహజవాయువు వంటి 8 కీలక రంగాల్లో మందగమనం... తాజా నష్టాలకు ప్రధాన కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 36,961 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 102 పాయింట్ల నష్టంతో 10,921గా కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న షేర్లు...
టెక్ మహీంద్రా, ఎస్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, హెసీఎల్ టెక్, టీసీఎస్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.