స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. వారంలో చివరి రోజు సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 588 పాయింట్లు తగ్గి 46,285 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 13,634 వద్ద స్థిరపడింది.
చివరి గంటలో ఐటీ, ఆటో, లోహ రంగాల్లో భారీగా నమోదైన అమ్మకాలు నష్టాలకు ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు. దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం క్షీణించొచ్చని ఆర్థిక సర్వే 2020-21 అంచనా వేయడం, అంతర్జాతీయ మార్కెట్లూ ప్రతికూలంగా స్పందిస్తుండటం కూడా నష్టాలకు కారణమైనట్లు తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 47,423 పాయింట్ల అత్యధిక స్థాయి, 46,160 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,966 పాయింట్ల గరిష్ఠ స్థాయి 13,596 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.