తెలంగాణ

telangana

ETV Bharat / business

ఢమాల్​ స్ట్రీట్​: సెన్సెక్స్ 1,375 పాయింట్లు పతనం - స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం

కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,375 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 379 పాయింట్ల నష్టంతో సెషన్‌ ముగించింది.

huge loss to stocks
స్టాక్‌ మార్కెట్లకు భారీ నష్టాలు

By

Published : Mar 30, 2020, 3:48 PM IST

స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1,375 పాయింట్ల నష్టంతో 28,440 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 379 పాయింట్లు క్షీణించి.. 8,281 వద్ద ముగిసింది.

ప్రపంచవ్యాప్తంగా కోరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల మదుపరులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కొవిడ్‌-19 కారణంగా ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నామన్న వార్తలతో అమ్మకాలపై దృష్టి సారించారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 29,498 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 28,291 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

నిఫ్టీ నేడు 8,576 పాయింట్ల అత్యధిక స్థాయి, 8,244 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

నెస్లే, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ 6 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి.

బజాజ్ ఫినాన్స్ నేడు అత్యధికంగా నష్టాన్ని మూటగట్టుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ భారీ నష్టాలను నమోదు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details