తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 236 డౌన్ - స్టాక్ మార్కెట్లు లైవ్​

stocks live updates
స్టాక్ మార్కెట్లు లైవ్​ అప్​డేట్స్

By

Published : Nov 12, 2020, 9:29 AM IST

Updated : Nov 12, 2020, 3:51 PM IST

15:48 November 12

జోరుకు అడ్డుకట్ట..

స్టాక్ మార్కెట్లలో బుల్​ జోరుకు గురువారం అడ్డుకట్ట పడింది. సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి.. 43,357 వద్దకు చేరింది. నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 12,691 వద్ద స్థిరపడింది.

అర్థిక షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం భయాలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేశాయి.

  • హెచ్​యూఎల్​, ఐటీసీ, ఎల్​&టీ, బజాజ్ ఫినాన్స్, టెక్​ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభపడ్డాయి.
  • ఎస్​బీఐ, కోటక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

12:08 November 12

ఎస్​బీఐ 2 శాతానికిపైగా నష్టం..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 290 పాయింట్లు కోల్పోయి 43,306  వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా నష్టంతో 12,677 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, చమురు, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • సన్​ఫార్మా, ఐటీసీ, హెచ్​యూఎల్​, ఎల్​&టీ, హెచ్​యూఎల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

09:07 November 12

రికార్డు స్థాయిల నుంచి కాస్త వెనక్కి సూచీలు..

స్టాక్ మార్కెట్ల రికార్డు లాభాలకు గురువారం బ్రేక్ పడింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో సూచీలు జీవనకాల గరిష్ఠాల నుంచి కాస్త వెనక్కి తగ్గుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా తగ్గి.. 43,437 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంతో 12,699 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక షేర్లలో ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.

  • ఎం&ఎం, టైటాన్​, ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్​సీఎల్​టెక్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Nov 12, 2020, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details