తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్ప లాభాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 150 ప్లస్

Stock Markets today
స్టాక్ మార్కెట్లు లైవ్ అప్​డేట్స్

By

Published : Nov 17, 2020, 9:39 AM IST

Updated : Nov 17, 2020, 12:48 PM IST

12:41 November 17

తగ్గిన జోరు..

మిడ్​ సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు కాస్త నెమ్మదించాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 43,788 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల వృద్ధితో 12,818 వద్ద ట్రేడవుతోంది.

  • టాటా స్టీల్, ఎస్​బీఐ, ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​టెక్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్​, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:50 November 17

టీకా ఆశలతో సూచీల జోరు..

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 330 పాయింట్లకుపైగా లాభంతో 43,968 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు పెరిగి 12,867 వద్ద కొనసాగుతోంది.

మెడార్నా టీకా 94.5 శాతం విజయవంతమైనట్లు ప్రకటన వెలువడటం అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ఆశల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు. హెవీ వెయిట్ షేర్లూ చాలా వరకు సానుకూలంగా స్పందిస్తుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • టాటా స్టీల్, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐ, ఎం&ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్​, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Nov 17, 2020, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details