తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటో, ఐటీ షేర్ల దన్నుతో ఆరంభ నష్టాలకు బ్రేక్

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 173 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుంది. ఐటీ, ఆటో షేర్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణం.

sensex today
నేటి స్టాక్ మార్కెట్ వార్తలు

By

Published : Aug 17, 2020, 3:46 PM IST

Updated : Aug 17, 2020, 5:59 PM IST

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో చివరకు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సోమవారం సెషన్​లో బీఎస్ఈ-సెన్సెక్స్ 173 పాయింట్లు బలపడి 38,051 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుని 11,259 వద్దకు చేరింది.

ఐటీ, ఆటో, విద్యుత్​ షేర్లు సానుకూలంగా స్పందించడం సోమవారం లాభాలకు ప్రధాన కారణం. వీటికి తోడు ఆరంభంలో నష్టాలను నమోదు చేసిన ఆర్థిక షేర్లు మిడ్​ సెషన్ తర్వాత కాస్త తేరుకోవడం కూడా లాభాలకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే..

సెన్సెక్స్ 38,120 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,734 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,267 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 11,144 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎన్​టీపీసీ, బజాజ్​ ఆటో, టెక్ మహీంద్రా, మారుతీ, ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్​, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాలను నమోదు చేశాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి. టోక్యో​, సియోల్​ సూచీలు మాత్రం నష్టాలతో ముగిశాయి.

రూపాయి

కరెన్సీ మార్కెట్​లో రూపాయి సోమవారం 2 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 74.88 వద్ద ఫ్లాట్​గా ఉంది.

మార్కెట్లో నేడు

ఇదీ చూడండి:షేర్​ చాట్​లో గూగుల్ భారీ పెట్టుబడులు!

Last Updated : Aug 17, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details