తెలంగాణ

telangana

ETV Bharat / business

మూడో రోజూ బుల్ జోరు- సెన్సెక్స్@46,973 - నిఫ్టీ

స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 529 పాయింట్ల లాభంతో 46,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148 పాయింట్లు పెరిగి 13,749 వద్ద ముగిసిది. ఫార్మా, ఆర్థిక షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

Stock market Updates
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

By

Published : Dec 24, 2020, 3:48 PM IST

Updated : Dec 24, 2020, 7:24 PM IST

స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ బుల్​ జోరు కొనసాగింది. గురువారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 529 పాయింట్లు బలపడి 46,973 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 13,749 వద్ద స్థిరపడింది.

ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒకానొక దశలో స్వల్ప లాభాలకు పరిమితమైన సూచీలు.. ఆర్థిక, ఫార్మా, హెవీ వెయిట్ షేర్ల అండతో భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలూ గురువారం లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 47,053 పాయింట్ల అత్యధిక స్థాయి, 46,539 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,772 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 13,626 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.

ఇన్ఫోసిస్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై మినహా.. టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలూ గురువారం లాభాలను గడించాయి.

ఇదీ చూడండి:వినియోగదారుల ఖాతా భద్రతకు కొత్త ఫీచర్లు: ఫేస్​బుక్​

Last Updated : Dec 24, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details