స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ స్వల్ప నష్టాలతో ముగిశాయి. బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోయి 51,309 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ అతి స్వల్పంగా 3 పాయింట్లు కోల్పోయి..15,106 వద్ద ఫ్లాట్గా స్థిరపడింది.
వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునేపనిలో పడటం సహా.. పలు దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు నష్టాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 51,512 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 50,846 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ 15,168 పాయింట్ల అత్యధిక స్థాయి.. 14,977 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.