దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ.. మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఆశలు, ఐరోపా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను గట్టెక్కిస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 77 పాయింట్లు లాభపడి 37 వేల 181 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 16 పాయింట్లు వృద్ధితో 10 వేల 999 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
టైటాన్ కంపెనీ, మారుతీ సుజూకీ, ఇన్ఫోసిస్, విప్రో, కోటక్ మహీంద్రా, ఎమ్ అండ్ ఎమ్, టాటా మోటార్స్, టీసీఎస్ రాణిస్తున్నాయి.