తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒడుదొడుకుల ట్రేడింగ్​లోనూ రికార్డు గరిష్ఠాలు

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో వారాంతపు సెషన్​ను స్వల్ప లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ స్వల్పంగా 70 పాయింట్లు పెరిగి.. తొలిసారి 46,950 పైన స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో రికార్డు స్థాయి అయిన 13,750 పైకి చేరింది. ఐటీ, ఫార్మా, హెవీ వెయిట్ బ్యాంకింగ్​ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

stocks close in profits
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

By

Published : Dec 18, 2020, 3:49 PM IST

స్టాక్ మార్కెట్లు వారాంతంలో స్వల్ప లాభాలే గడించినా.. రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 70 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 46,961 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి నూతన రికార్డు స్థాయి అయిన 13,760 వద్ద స్థిరపడింది.

విదేశీ పెట్టుబడుల ఊతంతో రికార్డు స్థాయి గరిష్ఠాల వద్ద శుక్రవారం సెషన్​ను ప్రారంభించాయి సూచీలు. అయితే లాభాల స్వీకరణ కారణంగా కొద్ది సేపటికే ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి. బైబ్యాక్ ప్రారంభించిన కారణంగా టీసీఎస్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఇతర ఐటీ షేర్లూ సానుకూలంగా స్పందించటం, చివరి గంటలో హెవీ వెయిట్ బ్యాంకింగ్ బ్యాంకింగ్​ షేర్లు పుంజుకోవడం వల్ల స్వల్ప లాభాలను గడించాయి సూచీలు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 47,026 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవన కాల గరిష్ఠం), 46,630 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 13,771 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన గరిష్ఠం).. 13,658 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్​, ఎస్​బీఐ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్ షేర్లు లాభాలను గడించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఓఎన్​జీసీ, మారుతీ, బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, హాంకాంగ్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సియోల్ సూచీ మాత్రం స్వల్పంగా లాభపడింది.

ఇదీ చూడండి:చిన్న మొత్తమైనా 'సిప్'తో ప్రయోజనాలెన్నో..

ABOUT THE AUTHOR

...view details