స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చర్యలు ముమ్మరమైన నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారించారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 61 పాయింట్ల లాభంతో 38,471 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో.. 11,269 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 38,888 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 38,387 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,389 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,245 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.