తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2020, 4:10 PM IST

Updated : Jan 3, 2020, 4:48 PM IST

ETV Bharat / business

అమెరికా వైమానిక దాడితో స్టాక్​మార్కెట్లకు నష్టాలు

ఇరాన్ సైనిక ఉన్నతాధికారి లక్ష్యంగా.. అమెరికా రాకెట్​ దాడులు చేయడం, చమురు ధరలు 4 శాతం పెరిగిన నేపథ్యంలో దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్​ 162 పాయింట్లు కోల్పోయి 41 వేల 464 వద్ద ముగియగా, నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 12 వేల 226 వద్ద స్థిరపడింది.

Sensex drops over 162 pts on US-Iran flare-up
ఇరాన్​పై అమెరికా దాడితో స్టాక్​మార్కెట్లకు నష్టాలు

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇరాన్​ జనరల్​ లక్ష్యంగా అమెరికా రాకెట్​ దాడులు చేసిన నేపథ్యంలో చమురు ధరలు ఒక్కసారిగా 4 శాతం మేర పెరగాయి. ఇదే మార్కెట్​ సెంటిమెంట్​ను దెబ్బతీసింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 162 పాయింట్లు కోల్పోయి 41,464 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 12,226 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలు

సన్​ఫార్మా, టీసీఎస్​, గెయిల్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా రాణించాయి.

జీ ఎంటర్​టైన్​మెంట్​, ఏసియన్​ పెయింట్స్, భారతీ ఇన్​ఫ్రాటెల్​, యాక్సిస్​ బ్యాంకు, బజాజ్​ ఆటో, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్​సెంగ్​, షాంగై కాంపోజిట్​ నష్టపోయాయి. కోస్పీ మాత్రం లాభాలతో గట్టెక్కింది.

రూపాయి విలువ

రూపాయి విలువ స్వల్పంగా పెరిగి, ఒక డాలరుకు రూ.71.75గా ఉంది.

ఇదీ చూడండి: మిస్త్రీ కేసు: ఆర్​ఓసీ విజ్ఞప్తిపై ఉత్తర్వులు రిజర్వ్​

Last Updated : Jan 3, 2020, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details