తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రతికూల సంకేతాలతో స్టాక్​ మార్కెట్లకు నష్టాలు - ఎస్​బీఐ

ఆసియా వ్యాప్తంగా బలహీన సంకేతాలతో స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. డీహెచ్​ఎఫ్​ఎల్​, ఎస్​ బ్యాంక్​ ఆరంభ ట్రేడింగ్​లోనే 6 శాతం మేర కోల్పోయాయి. భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ పుంజుకున్నాయి.

ప్రతికూల సంకేతాలతో స్టాక్​మార్కెట్లకు నష్టాలు

By

Published : Oct 10, 2019, 10:16 AM IST

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 135 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం... 38 వేల 43 వద్ద ఉంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 44 పాయింట్లు క్షీణించింది. 11 వేల 279 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే...

గ్రేసిమ్​, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​, ఇన్ఫోసిస్​, టీసీఎస్​ ఆరంభ లాభాలను నమోదుచేశాయి.

ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, ఎస్​ బ్యాంక్​, టాటా మోటార్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా స్టీల్,​ ఎం అండ్​ ఎం, బజాజ్​ ఫినాన్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్ డీలా పడ్డాయి.

మిగతా ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్​, టోక్యో సూచీలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. అమెరికా, చైనాల మధ్య మరోదశ వాణిజ్య చర్చలపై మదుపరులు ఆసక్తి కనబరుస్తున్నారు.

రూపాయి...

రూపాయి నేటి ట్రేడింగ్​లో స్వల్పంగా మెరుగుపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం... 12 పైసలు వృద్ధి చెంది 70.95గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details