43,400పైకి సెన్సెక్స్..
వారాంతపు సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 86 పాయింట్లు బలపడి చివరకు 43,443 వద్దకు చేరింది. నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 12,720 వద్ద స్థిరపడింది.
ఇటీవల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న ఆర్థిక షేర్లు తిరిగి పుంజుకోవడం లాభాలకు ప్రధాన కారణం
- బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- ఎల్&టీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.