తెలంగాణ

telangana

ETV Bharat / business

40వేల మార్క్ దాటిన సెన్సెక్స్.. నిఫ్టీ 12వేల పైకి.. - సెన్సెక్స్

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటవడం, దేశీయ విపణిలో పెరిగిన విదేశీ పెట్టుబడుల రాక  మార్కెట్​పై సానూకూల ప్రభావం చూపిస్తోంది. సెన్సెక్స్ 40వేల 80 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 12వేల 26వద్ద తచ్చాడుతోంది.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

By

Published : May 31, 2019, 10:12 AM IST

Updated : Jun 1, 2019, 12:52 PM IST

స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. గురువారం జీవన కాల గరిష్ఠంతో ముగిసిన సూచీలు ఇవాళా లాభాలను కొనసాగిస్తున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటవడం, దేశీయ విపణిలోకి విదేశీ పెట్టుబడుల రాక సానుకూల ప్రభావం చూపిస్తోంది.

గురువారం 39, 831.97 పాయింట్ల నూతన రికార్డు వద్ద ముగిసిన బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 40వేల మార్కును దాటి... 273 పాయింట్ల లాభంతో 40వేల 104 వద్ద ట్రేడవుతోంది. 11,945.90 వద్ద నూతన రికార్డుతో ముగిసిన జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 12వేల 31వద్ద తచ్చాడుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు

ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, టీసీఎస్, ఓన్​జీసీ, ఎల్​ అండ్ టీ, ఆక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు

ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, వేదాంత, ఎం అండ్ ఎం, ఆర్​ఐఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

బలపడిన రూపాయి

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు బలపడి రూ. 69.73 కు చేరుకుంది.

తగ్గిన ముడిచమురు

ముడి చమురు 1.04 శాతానికి తగ్గి బ్యారెల్ ధర 64.65 డాలర్లకు లభ్యమవుతోంది.

ఇదీ చూడండి: టోల్​గేట్​ 'ఫాస్ట్​ ట్యాగ్​​​లు' ఇక అమెజాన్​లోనూ...

Last Updated : Jun 1, 2019, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details