పారిశ్రామిక ప్రగతి మందగిస్తోందనే ఆందోళనల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 451 పాయింట్లు నష్టపోయి 37 వేల 29 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 11 వేల మార్కును కోల్పోయింది. ప్రస్తుతం 131 పాయింట్ల భారీ నష్టంతో 10 వేల 986 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో
భారతీ ఇన్ఫ్రాటెల్, పవర్‌గ్రిడ్ కార్ప్, విప్రో, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.