తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫెడ్ రిజర్వ్​​ వడ్డీ రేట్ల పెంపు ఈ ఏడాది లేనట్లే - ఫెడ్​

అమెరికా ఫెడ్​ రిజర్వ్ ఆశ్చర్యకరంగా వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సంవత్సరం వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండకపోవచ్చనే సంకేతాలు పంపింది.

ఫెడ్ రిజర్వ్

By

Published : Mar 21, 2019, 10:55 AM IST

బుధవారం రాత్రి సమావేశమైన అమెరికా ఫెడ్​ విధాన నిర్ణయ కమిటీ వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫెడ్​ కమిటీ విడుదల చేసిన నివేదికలో అమెరికా ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతున్నట్లు పేర్కొంది.

ఆశ్చర్యకర నిర్ణయాలు:

2019, సెప్టెంబర్​ నాటికి ఫెడ్​ కనీసం మూడు సార్లు వడ్డీ రేట్లు పెంచుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. 2019 లో వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చనే సంకేతాలు పంపింది.

ఫెడ్​ నిర్ణయంపై ఆర్థికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే 2020 లో వడ్డీ రేట్ల పెంపుతో పాటు కీలక సంస్కరణలు చేయాలని ఫెడ్​ కమిటీ సమావేశంలో చర్చలు సాగినట్లు సమాచారం .

ప్రస్తుతం ఫెడ్​ వడ్డీ రేట్లు 2.25 నుంచి 2.5 శాతంగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details