ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన కేసును నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఏజీఆర్ బకాయిల కింద రూ. 1.47 లక్షల కోట్లను టెలికాం సంస్థలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని టెలికాం విభాగం(డీఓటీ) గతేడాది వ్యాజ్యం దాఖలు చేసింది.
ఏజీఆర్ బకాయిలకు సంబంధించి అక్టోబర్లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. బకాయిల రూపంలో టెలికాం విభాగం సూచించిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు 3 నెలల సమయం ఇచ్చింది. అయితే గడువులోపు టెల్కోలు బకాయిలు చెల్లించటంలో విఫలమైన నేపథ్యంలో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు ఆగ్రహంతో బకాయిలు చెల్లించేందుకు టెల్కోలు సిద్ధమయ్యాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ కొంత మొత్తాలను చెల్లించాయి.