రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సుమారు రూ.104 కోట్లను తిరిగి చెల్లించాలని టీడీఎస్ఏటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యానికి ఎలాంటి విచారణ యోగ్యత లేదని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్లు సభ్యులుగా గల ధర్మాసనం పేర్కొంది.
టెలికాం వివాదాల పరిష్కారం, అప్పిలేట్ ట్రైబ్యునల్ (టీడీఎస్ఏటీ) 2018 డిసెంబర్ 21న ఆర్‌కామ్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. బ్యాంకు గ్యారెంటీగా ఉంచిన రూ.908 కోట్ల నుంచి రూ.774 కోట్ల స్పెక్ట్రం ఛార్జీలను మినహాయించుకోవాలని.... ఆర్‌కామ్‌కు రూ.104 కోట్లు తిరిగి చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
టెలికాంశాఖ ఇప్పటికే రూ.30.33 కోట్లు సర్దుబాటు చేసింది.
ఇదీ చూడండి:షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్పెక్స్ లీక్!