తెలంగాణ

telangana

ETV Bharat / business

పదేళ్లలో ఏజీఆర్ బకాయిలు చెల్లించండి- సుప్రీం

ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో టెల్కోలకు సుప్రీం కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మొత్తం బకాయిలు చెల్లించేందుకు టెల్కోలు 15 ఏళ్లు గడువు కోరగా.. అత్యున్నత న్యాయస్థానం 10 సంవత్సరాలు ఇచ్చింది. టెల్కోలపై ఉన్న కోర్టు ధిక్కరణలను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

Supreme court gives 10 years for Agr payments
ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు పదేళ్ల గడువు

By

Published : Sep 1, 2020, 12:37 PM IST

టెలికాం సంస్థల సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) వివాదంలో కీలక తీర్పు వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు 10 సంవత్సరాల గడువు ఇచ్చింది. 2031 నాటికి మొత్తం బకాయిల చెల్లింపులు పూర్తి చేయాలని టెల్కోలను ఆదేశించింది.

అయితే టెల్కోలు తాము చెల్లించాల్సిన ఏజీఆర్​ బకాయిల్లో 10 శాతం 2021 మార్చి 31లోపు జమ చేయాలని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. ప్రతి ఏటా వడ్డీ చెల్లింపుల వివరాలు అందించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న బ్యాంకు గ్యారెంటీలు యథాతథంగా కొనసాగుతాయని న్యాయస్థానం పేర్కొంది.

కోర్టు ధిక్కరణలను తొలిగిస్తూ టెలికాం సంస్థలకుసుప్రీం ఊరటనిచ్చింది. అన్ని సంస్థల ఎండీలు నిబంధనలు అంగీకరిస్తూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

దివాల ప్రక్రియలో ఉన్న టెల్కోలకు స్పెక్ట్రమ్ విక్రయించాలా? వద్దా? అనే విషయాన్ని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్​సీఎల్​టీ) నిర్ణయిస్తుందని సుప్రీం కోర్టు వెల్లడించింది.

ఇదీ చూడండి:కరోనా దెబ్బకు జీడీపీ 23.9% క్షీణత

ABOUT THE AUTHOR

...view details