SBI Q3 Results 2022: అతిపెద్ద దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ క్యూ3లో 62శాతం లాభాలను గడించింది. నికరలాభం రూ. 8,432కోట్లు నమోదు చేసినట్లు వెల్లడించింది ఎస్బీఐ. గతేడాది ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం రూ. 5,196 కోట్లుగా ఉంది.
"ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభంలో అత్యధికంగా అంటే 62శాతం వృద్ధి చెంది రూ. 8,432 కోట్లు నమోదు చేసింది." అని ఎస్బీఐ పేర్కొంది. ఇదే సమయంలో బ్యాంకు ఆదాయం రూ. 78,352కు పెరిగిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఆదాయం రూ. 75,981గా ఉందని పేర్కొంది.