తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI: జులై 1 నుంచి ఎస్‌బీఐ కొత్త ఛార్జీలు! - STATE BANK OF INIDA

జీరో బ్యాలెన్స్‌ ఖాతా(బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్- బీఎస్ బీడీ) కలిగి ఉన్నవారి నుంచి స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్‌బీఐ- SBI) జులై 1 నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు వసూలు చేయనుంది. ఎస్‌బీఐకి చెందిన ఏదైనా బ్రాంచ్‌, ఏటీఎం (ATM)లో మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. అంతకంటే ఎక్కువ సార్లు నగదు తీసుకోవాలనుకుంటే.. ప్రతిసారి రూ.15లతో పాటు జీఎస్​టీ(GST) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

SBI
ఎస్‌బీఐ

By

Published : May 27, 2021, 6:51 AM IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు ఓ నిరాశ కలిగించే వార్త అందించింది. బేసిక్‌ సేవింగ్స్‌ అంటే జీరో బ్యాలెన్స్‌ ఖాతా(బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్- బీఎస్ బీడీ) కలిగి ఉన్నవారికి జులై 1 నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు(service charges) వసూలు చేయనుంది. నగదు ఉపసంహరణ, చెక్‌బుక్‌పై పరిమితులు విధించింది. ఆ పరిధి దాటితో రుసుములు(FEE) వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.

ఎస్‌బీఐకి చెందిన ఏదైనా బ్రాంచ్‌, ఏటీఎం(atm) లో మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. అంతకంటే ఎక్కువ సార్లు నగదు తీసుకోవాలనుకుంటే.. ప్రతిసారి రూ.15లతో పాటు జీఎస్​టీ(GST) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకుకు చెందిన ఏటీఎంల నుంచి నగదు తీసుకున్నా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. ఇకపై ఎస్‌బీఐ, ఎస్‌బీఐయేతర ఏటీఎంలు, ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

జీఎస్​టీ(gst) అదనం

ఇక బీఎస్ బీడీ ఖాతా కలిగిన వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్‌ లీవ్స్‌ ఎస్‌బీఐ(SBI) ఉచితంగా అందజేస్తుంది. ఇక అంతకంటే ఎక్కువ కావాలంటే 10 చెక్‌ లీవ్స్ కలిగిన బుక్‌కు రూ.40లతో పాటు అదనంగా జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 25 చెక్‌ లీవ్స్ కలిగిన బుక్‌ కావాలంటే జీఎస్​టీతో పాటు రూ.75 కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసరంగా చెక్‌ బుక్ కావాలని కోరితే.. 10 లీవ్స్‌కి రూ.50+జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సీనియర్‌ సిటిజన్లకు మాత్రం చెక్‌ బుక్‌ ఛార్జీలు వర్తించవు.

ఇదీ చదవండి:సామాజిక సంస్థలకు కేంద్రం చివరి అవకాశం

ABOUT THE AUTHOR

...view details