గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 6.70 శాతంగా ఉన్న వడ్డీ రేటును 6.95కి పెంచింది. ఏప్రిల్ 1 నుంచే తాజా వడ్డీ రేట్లు అమలు లోకి వస్తాయని తెలిపింది.
ఎస్బీఐ షాక్- హోం లోన్ వడ్డీ రేట్లు పెంపు
బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్.. హోం లోన్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త వడ్డీ రేట్లు తక్షణమే అమలులోకి రానున్నాయి.
గృహ రుణాలపై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
మార్చి 31 వరకు రూ.75 లక్షల వరకు గృహ రుణాలపై 6.70 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు రుణాలపై 6.75 శాతం వడ్డీ వసూలు చేసింది ఎస్బీఐ.
పెంచిన వడ్డీ రేట్లతో పాటు ప్రాసెసింగ్ ఫీజ్ను కూడా విధిస్తున్నట్లు తెలిపింది ఎస్బీఐ. లోన్ మొత్తంలో 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీజ్ ఉండనున్నట్లు పేర్కొంది. దీనితో పాటు జీఎస్టీ అదనం అని స్పష్టం చేసింది.
Last Updated : Apr 5, 2021, 2:00 PM IST