తెలంగాణ

telangana

రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

By

Published : Jan 18, 2020, 12:30 PM IST

ఎస్​బీఐ జనవరి 10 నుంచి రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ)పై వడ్డీరేట్లు తగ్గించింది. తాజా సవరణ తరువాత, ఒక సంవత్సరం రికరింగ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.10 శాతం వడ్డీని అందిస్తుంది. ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే ఆర్డీలకు బ్యాంకు 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని తగ్గించింది.

sbi cuts recurring deposit interest rates by 15 basis points
రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

దేశంలోనే అతి పెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జనవరి 10 నుంచి రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ) పై వడ్డీ రేట్లను తగ్గించింది. తాజా సవరణ తరువాత, ఒక సంవత్సరం రికరింగ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు ఎస్‌బీఐ 6.10 శాతం వడ్డీని అందిస్తుంది. ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే ఆర్డీలకు బ్యాంకు 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని తగ్గించింది. ఇంతకు ముందు ఈ రికరింగ్ డిపాజిట్లు 6.25 శాతం వడ్డీ రేటును అందించేవి, కానీ తాజా సవరణ తరువాత, ఈ ఆర్డీ ఖాతాలు 6.10 శాతం వడ్డీ రేటును పొందుతాయి.

జనవరి 10, 2020 నుంచి అమలులోకి వచ్చిన ఎస్‌బీఐ తాజా ఆర్డీ వడ్డీ రేట్ల వివరాలు :

  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.10 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ 6.10 శాతం
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ 6.10 శాతం
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 6.10 శాతం

ఎస్‌బీఐ ఆర్డీని రూ. 100ల కనీస నెలవారీ డిపాజిట్ తో ప్రారంభించవచ్చు. అయితే, దీనికి ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఒకసారి ఆర్డీ వడ్డీ రేటును నిర్ణయించిన తరువాత, డిపాజిట్ కాలపరిమితి ముగిసేవరకు వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదు.

ఎస్‌బీఐ దీర్ఘకాలిక డిపాజిట్లపై ఎఫ్‌డీ రేట్లను కూడా తగ్గించింది. గత నెలలో, బ్యాంకు తన బాహ్య బెంచ్​మార్క్ ఆధారిత రేటు (ఈబీఆర్) ను 25 బేసిస్ పాయింట్ల మేర (8.05 శాతం నుంచి 7.80 శాతానికి) తగ్గించింది. దానితో, బ్యాంకు గృహ రుణ రేటు కూడా 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తన ఎంసీఎల్ఆర్ ను ఎనిమిది సార్లు తగ్గించింది. ప్రస్తుతం దాని ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 7.90 శాతంగా ఉంది.

ఇదీ చూడండి: 'టెలికాం రంగం' తిప్పలు.. సంక్షోభం నుంచి గట్టెక్కేనా!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details