కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంపొందిచేందుకు జన్ ఔషధి కేంద్రాల్లో శానిటరీ న్యాప్కిన్ల ధరను తగ్గించింది. కాలుష్యరహితమైన విటిని రేపటి నుంచే అన్ని జన్ ఔషధి కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
ఇకపై ఒక్క రూపాయికే...
మహిళలకు మరింత అందుబాటులో చౌకగా దొరికేలా నాప్కిన్ల ధరను 2రూపాయల 50 పైసల నుంచి 1 రూపాయికి తగ్గించింది. నాలుగు ప్యాడ్లతో కూడిన ఒక ప్యాక్ ఇప్పటి వరకూ 10 రూపాయలకు విక్రయించేవారు. ఇకపై 4 రూపాయలకే లభించనున్నట్లు మంత్రి తెలిపారు. న్యాప్కిన్లను సువిధా బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న 5వేల 500 జన్ ఔషధి కేంద్రాల్లో విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.
గతేడాది జన్ ఔషధి కేంద్రాల ద్వారా దాదాపు 2 కోట్ల 20 లక్షల న్యాప్కిన్లు కొనుగోలు అయ్యాయని, ధర తగ్గించినందున వీటి వినియోగం మరింత పెరిగి అమ్మకాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి:బంగారం ధర కొత్త రికార్డ్... నేడు ఎంత పెరిగిందంటే!