గెలాక్సీ ఎస్ సిరీస్‌లో నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది సామ్సంగ్. 'ఎస్ 10', 'ఎస్10 ప్లస్', 'ఎస్ 10ఈ' స్మార్ట్ఫోన్ల ధరలను బహిర్గతం చేసింది ఈ చరవాణి సంస్థ. కనీస ధర రూ.55,900లుగా నిర్ణయించింది. గతంలో ఫిబ్రవరి 20న ఎస్10 మోడల్స్‌ని అమెరికా శాన్ఫ్రాన్సిస్కో లో విడుదల చేశారు.
- సామ్సంగ్ గెలాక్సీ ఎస్10:
అంతర్గత స్టోరేజి | ధర |
512 జీబీ | రూ.84,900 |
128 జీబీ | రూ.66,900 |
అంతర్గత స్టోరేజి | ధర |
1టీబీ | రూ.1,17,900 |
512 జీబీ | రూ.91,900 |
128 జీబీ | రూ. 73,900 |
- 'ఎస్10ఈ' మోడల్లో కేవలం 128జీబీ అంతర్గత మెమొరీ మాత్రమే అందుబాటులో ఉంది.
'ఎస్' ఫోన్ల ఫీచర్లు:
ఫీచర్లు\ఫోను | సామ్సంగ్ గెలాక్సీ ఎస్10 | సామ్సంగ్ ఎస్10 ప్లస్ | సామ్సంగ్ ఎస్10ఈ |
|
తాకేతెర(అంగుళాలు)
6.1 | 6.4 | 5.8 | ప్రాసెసర్ | ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్/సామ్సంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్. | ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్/సామ్సంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్. | ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్/సామ్సంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్. |
ర్యామ్ | 8 జీబీ | 8/12 జీబీ | 6/8 జీబీ |
మెమోరీ | 128/512 జీబీ | 128/512 జీబీ/1 టీబీ | 128/256 జీబీ |
ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ | 512 జీబీ | 512 జీబీ | 512 జీబీ |
వెనుక కెమెరా | 12, 12, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు | 12, 12, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు | 12, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు. |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 9.0 పై | ఆండ్రాయిడ్ 9.0 పై | ఆండ్రాయిడ్ 9.0 పై |
సిమ్ స్లాట్ | సింగిల్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ | సింగిల్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ | సింగిల్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ |
సెల్ఫీ కెమెరా | 10 మెగాపిక్సల్ | 10, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమేరా | 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా |
బ్యాటరీ | 3400 ఎంఏహెచ్ | 4100 ఎంఏహెచ్ | 3100 ఎంఏహెచ్ |
- సినిమాటిక్ ఇనిఫినిటీ 'ఓ డిస్ప్లే', ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఫోన్ల డిస్‌ప్లేలకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్నూ అందిస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లైస్ ఛార్జింగ్ , వైర్‌లెస్ పవర్‌షేర్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్లు మూడింటిలోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్(ఎస్10, ఎస్10 ప్లస్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ (ఎస్10ఈ)లో ఏర్పాటు చేశారు.
గత ఏడాది 30వేల కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ల విక్రయాలలో భారత్‌లో 8 శాతం వృద్ధి నమోదు చేసింది సామ్సంగ్ సంస్థ. ఈ సంస్థ 34 శాతం భారత మార్కెట్ వాటాను అందుకోగా, ఒన్‌ప్లస్ 33శాతంతో సామ్‌సంగ్‌కు గట్టి పోటీని ఇస్తుంది.