Ukraine war effect on India: కొవిడ్-19 మూడు దశల పరిణామాల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల రూపంలో మరో ముప్పు ఆందోళన పెంచుతోంది. ఆ దేశంతో వాణిజ్య పరంగా ప్రత్యక్ష ప్రభావం కంటే.. యుద్ధం వస్తే వివిధ దేశాలపై భద్రతాపరంగాను, ఆర్థికంగాను ప్రతికూల ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతాయనే ఆందోళనలున్నాయి. ఇప్పటికే ముడిచమురు బ్యారెల్ ధర ఏడేళ్ల గరిష్ఠమైన 97 డాలర్లకు చేరడం, దిగుమతులపైనే అధికంగా ఆధారపడిన భారత్ వంటి దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇందువల్ల పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలతో, స్టాక్‌మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్‌తో వాణిజ్య సంబంధాలున్న దేశాలకూ కొంత ఇబ్బందికరమే. మనదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉక్రెయిన్‌తో మన ద్యైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఏమిటంటే.
Russia Ukraine war
ఔషధాలు వాళ్లకు..
India Ukraine exports imports
ఉక్రెయిన్‌కు భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాటిల్లో ఔషధాలదే సింహభాగం. విలువపరంగా ఉక్రెయిన్‌కు ఔషధాలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్ మూడోది. జర్మనీ, ఫ్రాన్స్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Indian economy Russia Ukraine
- ర్యాన్‌బాక్సీ, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ గ్రూపు తదితర భారత కంపెనీలకు ఉక్రెయిన్‌లో కార్యాలయాలున్నాయి. ఈ కంపెనీలు అక్కడ ఇండియన్ ఫార్మాస్యూటికల్ మ్యాన్‌ఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌ను (ఐపీఎంఏ) కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
- రియాక్టర్లు/ బాయిలర్ యంత్రాలు, మెకానికల్ సామగ్రి, నూనె గింజలు, పండ్లు, కాఫీ, తేయాకు లాంటి వాటినీ ఉక్రెయిన్‌కు భారత్ ప్రధానంగా ఎగుమతి చేస్తోంది.
సన్‌ఫ్లవర్ నూనె మనకు..