తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లకు గండికొట్టనున్న రిలయన్స్!

రిలయన్స్ ప్రవేశంతో ఆన్​లైన్​ రిటైల్​ రంగంలో ప్రత్యర్థి సంస్థలు భారీగా దెబ్బతినే అవకాశాలున్నాయని ఫోరెస్టర్​ రీసర్చ్​ సంస్థ నివేదిక తెలిపింది. భారత ఈ-కామర్స్ రంగం విలువ 2023 నాటికి 85 బిలియన్ డాలర్లకు చేరొచ్చని పేర్కొంది.

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లకు గండికొట్టనున్న రిలయన్స్!

By

Published : May 22, 2019, 10:59 PM IST

ఆన్​లైన్​ రిటైల్ వ్యాపారంలో రిలయన్స్ ప్రవేశంతో ప్రత్యర్థి సంస్థల లాభాలకు భారీగా గండి పడనుందని అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ఫోరెస్టర్ తాజా నివేదికలో తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం 2023 నాటికి భారత ఆన్​లైన్ రిటైల్​ అమ్మకాల విలువ 25.8 శాతం పెరిగి 85 బిలియన్​ డాలర్లకు చేరనుంది.

ఈ కామర్స్​ రంగానికి 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో జీఎస్​టీ, 2018 డిసెంబర్​లో నూతన ఈ-కామర్స్​ విధానాలు ఆటంకంగా మారాయని నివేదిక పేర్కొంది.

ఈ తరుణంలో దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఆన్​లైన్​ రిటైల్ మార్కెట్లోకి రానుంది. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా 6,600 నగరాలు, పట్టణాల్లో 10,415 రిటైల్​ స్టోర్లు.. 500 మిలియన్ల మంది వినియోగదార్లు ఉన్నారు. ఇంత భారీ మొత్తంలో మౌలిక వసతులు, వినియోగదార్లు ఉండటం రిలయన్స్​కు కలిసొచ్చే అంశమని నివేదిక తెలిపింది.

"ఈ-కామర్స్ వ్యాపారాల ప్రారంభ ఆఫర్​ కింద రిలయన్స్ ఇచ్చే భారీ ఆఫర్లతో ప్రస్తుతం ఉన్న అమెజాన్, ఫ్లిప్​కార్ట్​లకు గట్టి పోటీ ఎదురవ్వచ్చు." - సతీశ్​ మీనా, సీనియర్ విశ్లేషకుడు, ఫోరెస్టర్​ పరిశోధన సంస్థ

టెలికాంలో రంగంలో సంచలనం

కొత్త రంగాలకు వ్యాపారాలను విస్తరించినప్పుడు భారీ ఆఫర్లతో వినియోగదార్లను ఆకట్టుకోవడం రిలయన్స్​కు సాధారణ విషయం.

గతంలో 2003లో టెలికాం రంగంలోకి ప్రవేశించింది రిలయన్స్. అప్పుడు మాన్​సూన్​ టారిఫ్​ ప్లాన్​ కింద వాయిస్​ కాల్​ ధరలు నిమిషానికి రూ.2 నుంచి కేవలం 40 పైసలకు తగ్గించి ప్రత్యర్థి సంస్థలకు గట్టిపోటీ ఇచ్చింది.

రిలయన్స్ జియోతో టెలికాం రంగంలో వచ్చిని మార్పులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా 1జీబీ డేటా ధర రూ. 250 నుంచి కేవలం రూ. 50 రూపాయలకు తగ్గంచి టారీఫ్ వార్​కు తెరలేపింది. ఈ దెబ్బతో ఇతర టెలికాం సంస్థలు విలవిలలాడాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్

ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్​లైన్​ టు ఆఫ్​లైన్ ఈ-కామర్స్ వ్యాపారాల ప్రారంభానికి పనులు వేగంగా జరుగుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ ప్రకటించారు.

"ఈ-కామర్స్ రంగంపై ఆంక్షలు విధిస్తూ 2018 డిసెంబరులో భారత ప్రభుత్వం నూతన విధానాలను తీసుకువచ్చింది. ఇందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సవరించింది. వాటితో పాటు తమ సంస్థలకు వాటాలున్న వస్తువులను ఎక్స్​క్లూజివ్ ఆఫర్ల పేరుతో విక్రయించేందుకు వీల్లేదు."

ఈ అంశాలు రిలయన్స్​కు కలిసొచ్చే అంశం. దీని ఆధారంగా రిలయన్స్ రిటైల్స్​కు ఉన్న మౌలిక సదుపాయాలను వాడుకుని భారీ ఎత్తున విపణిలో ప్రవేశించాలని రిలయన్స్ భావిస్తోందని విశ్లేషకులు సతీష్ మీనా అన్నారు.

ఇప్పటికే గత నెలలో రిలయన్స్ ఉద్యోగులకు ఫుడ్, గ్రోజరి యాప్​ను అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి సేవలను ప్రారంభించాలని భావిస్తోంది.

ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ 18.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడించింది. గత ఐదేళ్లలో 55 శాతం వృద్ధి చెందింది ఈ సంస్థ.

ఇదీ చూడండి: ఫలితాల ముందు సానుకూల ముగింపు..

ABOUT THE AUTHOR

...view details