తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగులకు గుడ్​ న్యూస్- టేక్​ హోమ్​ సేలరీ పెంపు! - టేక్ హోమ్​ సేలరీ

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఉద్యోగులకు ఊరట కలిగిస్తూ కీలక ప్రకటన చేశారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్​ను 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఫలితంగా ఉద్యోగుల టేక్ హోమ్​ సేలరీ పెరగనుంది.

Reduction of employees' PF contribution to 10%
ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్ 10 శాతానికి తగ్గింపు

By

Published : May 13, 2020, 5:51 PM IST

ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తూ.... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కంపెనీల, ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్​ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనితో ఉద్యోగుల చేతికి అందే జీతం (టేక్ హోమ్ సేలరీ) పెరగనుంది. దీని వల్ల ఉద్యోగులకు మూడు నెలలగాను రూ.6,750 కోట్లు లబ్ధి చేకూరనుంది.

వచ్చే మూడు నెలల అంటే జూన్, జులై, ఆగస్టు వరకు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం మాత్రం తన వాటాగా 12శాతాన్నే చెల్లిస్తుంది.

ఈపీఎఫ్‌ భారం కేంద్రానిదే..

వచ్చే మూడు నెలల వరకు రూ.15 వేల లోపు వేతనం ఉన్న ఉద్యోగులపై ఈపీఎఫ్‌ భారం (ఉద్యోగి, యజమాని ఇద్దరి వాటాలను(10+12)) కేంద్రమే భరించనుంది. వంద లోపు ఉద్యోగులున్న సంస్థలకు ఇది వర్తిస్తుంది.

రానున్న మూడు నెలల్లో కంపెనీలు, ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్​ రూ.2,500 కోట్లను కేంద్రమే ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తుంది. ఫలితంగా 72.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

ఇప్పటికే చిన్న సంస్థల ఈపీఎఫ్​ భారాన్ని కేంద్రం భరిస్తుండగా... మరో 3 నెలలకు ఆ వెసులుబాటును పొడిగించింది.

ఇదీ చూడండి:చిన్న పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు

ABOUT THE AUTHOR

...view details