తెలంగాణ

telangana

ETV Bharat / business

'2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతం!' - ద్రవ్యోల్బణం

భారత ఆర్థిక వ్యవస్థ ఒకే దిశలో సాగుతోందని, అదీ ముందుకేనని స్పష్టం చేశారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. బడ్జెట్​ ఇచ్చిన ప్రేరణతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు.

By

Published : Feb 5, 2021, 11:50 AM IST

Updated : Feb 5, 2021, 1:00 PM IST

కరోనా మహమ్మారి నుంచి దేశ ఆర్థిక రంగం పుంజుకుంటున్న వేళ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతంగా ఉంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ ఒకే దిశలో సాగుతోందని, అదీ ముందుకేనని వెల్లడించారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఫలితాలను ప్రకటించిన దాస్​.. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి:రెపో, రివర్స్​ రెపో రేట్లు యథాతథం: ఆర్​బీఐ

ద్రవ్యోల్బణంపైనా స్పందించిన ఆర్​బీఐ గవర్నర్​.. కూరగాయల ధరలు సమీప భవిష్యత్తులో పెరగకపోవచ్చని అన్నారు. ద్రవ్యోల్బణం తిరిగి గాడిలోకి వస్తోందని తెలిపారు.

ప్రస్తుత త్రైమాసికంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 5.2 శాతంకి దిగి వచ్చే అవకాశం ఉందన్న ఆయన తదుపరి ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే నాటికి 4.3 శాతం దిగువకు వస్తుందని.. అంచనా వేశారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ఊతంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఐతే మార్చి చివరకు ద్రవ్యోల్బణాన్ని కేంద్రం సమీక్షించే అవకాశం ఉందని శక్తికాంత దాస్ చెప్పారు.

ఇదీ చూడండి:భారత్​లో టీకా వినియోగ దరఖాస్తు ఉపసంహరించుకున్న ఫైజర్​

Last Updated : Feb 5, 2021, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details