కంటి చూపులేని వారు సులభంగా కరెన్సీ నోట్లు గుర్తించేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఓ కొత్త మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. 'ఎంఏఎన్ఐ-మనీ' పేరుతో రూపొందించిన ఈ మొబైల్ అప్లికేషన్‌ను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రారంభించారు.
ఆఫ్‌లైన్‌లో కూడా
ఈ యాప్‌ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు దీన్ని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీనోట్లను స్కాన్ చేస్తే... హిందీ లేదా ఇంగ్లీష్‌లో సమాధానం వస్తుంది.